కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
బేతంచెర్ల: వైఎస్సార్‌సీపీ కోసం కష్ట పడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీకృష్ణ, పట్టణ, మండల కన్వీనర్లు పిట్టల జాకీర్, తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి బుగ్గన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రధానంగా గిట్టు బాటు ధర లభించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పాలక ప్రభుత్వం వ్యహరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలు, కార్మికులు, రైతులు విసిగెత్తిపోయారన్నారు. సమావేశానికి ముందుగా ముందుగా పట్టణంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రేమ్ స్వరూప్, అర్చనల దంపతుల కుమార్తె సురత్ సహేలి, వరుడు ప్రేమ్ పావన్ వివాహం గత నెలలో 24న జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన వారి ఇంటికి వెళ్లి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బైటిపేట కాలనీకి చెందిన మాజీ వార్డు సభ్యుడు రామాంజనేయులు భార్య జయలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో రామాంజనేయులును బుగ్గన పరామర్శించారు. ఆయన వెంట వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు మూర్తుజావలి, ఖాజ, వైఎస్సార్‌సీపీ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, నారాయణ, బూసిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మద్దిలేటి, నిరంజన్, జయ ప్రకాష్ రెడ్డి, మురళీ, వెంకిరెడ్డి, గూటుపల్లె, గోరుమానుకొండ సర్పంచ్‌లు శ్రీరాములు, వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ రంగస్వామి ఉన్నారు.


