గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుక
స్థానిక సంస్థలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పక్కాగా స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయితే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన ఆదాయ వనరు అయిన ఈ నిధులను జమ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎలాంటి ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులకు తోడు స్టాంప్ డ్యూటీ నిధులు వస్తే గ్రామాలకు ఊపిరి అందుతుంది. – బి.రఘునాథరెడ్డి, జెడ్పీటీసీ, కోడుమూరు
ఎలాంటి ఇతర ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్‌కు ప్రధాన ఆదాయ వనరు అయిన స్టాంప్ డ్యూటీ నిధులు జమ కాకుంటే ఎలా? రాష్ట్రంలోని ఇతర జిల్లా పరిషత్‌లతో పోలిస్తే మన జిల్లా పరిషత్‌కు ఎలాంటి అదనపు ఆదాయాలు లేవు. స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయితే జెడ్పీటీసీలుగా మా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థలకు మరింత ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయ్యేలా చూడాలి.
– షేక్ కరీమున్నీసా, జెడ్పీటీసీ, నందికొట్కూరు
ప్రభుత్వ నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల స్థానిక సంస్థలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. అంతంతమాత్రం ఆదాయం ఉన్న జిల్లా పరిషత్‌కు ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదల కాకుంటే ఎలా? స్టాంప్ డ్యూటీ కింద స్థానిక సంస్థలకు విడుదలయ్యే నిధులతో గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ నిధులను సర్దుబాటు చేయడంలో జాప్యాన్ని నివారించి వెంటనే నిధులు జెడ్పీకి జమ అయ్యేలా చూడాలి.
– వి.రామకృష్ణ, జెడ్పీటీసీ, దేవనకొండ
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుక
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుక


