మూటా ముల్లె సర్దుకుని..
అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు మూట కట్టుకున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. పత్తి, ఉల్లి, మిరప, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు, రైతు కూలీలు మూటా ముల్లె సర్దుకుని వలస బాట పట్టారు. గురువారం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతులు, రైతు కూలీలు పనుల కోసం తెలంగాణ రాష్ట్రం వద్ద అచ్చం పేటకు వెళ్లారు. దాదాపు 20 కుటుంబాలు పిల్లపాలపతో వలస వెళ్లారు. వలస నివారణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – నందవరం
ఇబ్రహీంపురం నుంచి చిన్నారులతో వలస వెళ్తున్న కూలీలు


