మదిని దోచి ‘పట్టా’రు..
మంచు కాదది.. నల్లమలను తాకిన శ్వేతవర్ణపు మేఘాలు
పచ్చటి నల్లమల అందాల మధ్య అందమైన రైలు ప్రయాణం
అర్జునుడి విల్లు నుంచి సంధించిన బాణమా.. ప్రకృతి మాత నెత్తిన ధరించిన పసిడి ఆభరణమా.. అన్నట్లుగా కను చూపు మేర కనిపించే రైలు మార్గం ఓ వైపు. మేఘాలతో కప్పేసి హిమగిరులను తలపించే ఎత్తైన కొండల అందాలు మరో వైపు.. పుడమి తల్లి పచ్చని కోక కట్టుకుందా అన్నట్లుగా పచ్చని సోయగాలు ఇంకో వైపు.. ఇలా అడుగడుగునా అపురూప దృశ్యాలకు నెలవు నల్లమల. నంద్యాల–గిద్దలూరు నల్లమల మార్గంలో రైలులో ప్రయాణం ప్రయాణికులకు ఓ అద్భుతమైన యాత్రగా గుర్తుండిపోతుంది. నల్లమల పచ్చటి అందాలు, పక్షుల కిలకిలారావాలు, ఆకాశం, నల్లమల కొండలు ఒక్కటిగా కలిసి పోయాయా అన్నట్లు అగుపించే దృశ్యాలు మనసును దోచేస్తాయి. నల్లమలను వీక్షిస్తూ ఎందరో కవుల హృదయాలు స్పందించి అపురూప గేయాలను ఆలపించారు. – మహానంది
మదిని దోచి ‘పట్టా’రు..


