కారు ఢీకొని మహిళ దుర్మరణం
ఆళ్ళగడ్డ: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పేరాయిపల్లె మెట్ట వద్ద కారు ఢీ కొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గోపులాపురం గ్రామానికి చెందిన పుల్లమ్మ(55) చెనక్కాయలను గ్రామ పరిసరాల్లో అమ్ముతూ జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో గురువారం పేరాయిపల్లె మెట్ట సమీపంలోని పాఠశాలలో చెనక్కాయలు అమ్ముకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఢీ కొట్టిన కారు అదే వేగంలో వెళ్లిపోయింది. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, కారు ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.


