రైతులకు చేసిన మేలేందో చెప్పుసార్
జూపాడుబంగ్లా: రైతులకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతుంటే ఆ పంటలేసుకో.. ఈ పంటలేసుకోమని భలే చెబుతున్నావులే సార్ అంటూ రైతులు శివన్న, చిన్నలక్ష్మయ్యలు ఏఓ కృష్ణారెడ్డిని నిలదీయటంతో ఆయన వారికి సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. బుధవారం జూపాడుబంగ్లాలో ఏఓ కృష్ణారెడ్డి, రైతుసేవాకేంద్రం సిబ్బంది గ్రామంలోని రైతుల వద్దకు వెళ్లి ప్రకృతి వ్యవసాయం అలవర్చుకోండి, ఉద్యానవనపంటలు వేసుకోండి, 90శాతంతో డ్రిప్‌పైపులు ఇస్తామంటూ చెప్పసాగారు. ఇంతలో తెలుగు శివన్న, చిన్నలక్ష్మయ్య అనే రైతులు కల్పించుకొని ముందు పండించిన మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించు, కొనుగోలు కేంద్రాలు పెట్టించి రూ.2,400 చొప్పున కొనేలా చెయ్యి.. వర్షాలు పడి పంటనష్టమైతే ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడొచ్చి అవిస్తాం, ఇవిస్తామంటూ భలే చెబుతున్నావంటూ మండిపడ్డారు. రైతులు అడిగిన ప్రశ్నలకు ఏఓ కృష్ణారెడ్డి సమాధానం చెప్పలేక వెనుదిరిగి వెళ్లారు. ఓట్లేసి గెలిపించుకొన్న పాపానికి మాకు తగిన శాస్తి చేశాడంటూ రైతులు చంద్రబాబు సర్కార్‌పై తీవ్రవిమర్శలు గుప్పించారు.


