ప్రజాస్వామ్య విలువలపైవిద్యార్థులకు అవగాహన
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టర్ చాంబర్‌లో విద్యార్థులతో బుధవారం జిల్లా కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారికి పురస్కారాలు అందజేిశామన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి మొత్తం ముగ్గురు విద్యార్థులను ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు వివరించారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
నంద్యాల: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకోసం అందరూ కృషి చేయాలని, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని ఎస్పీ సునీల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భారత రాజ్యంగ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ సునీల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. ఫలితంగా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు దక్కాయన్నారు. నవ సమాజం, సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. డీఎస్పీలు కె.ప్రమోద్, రామంజి నాయక్ , పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో ప్లాస్టిక్
వినియోగం పూర్తిగా నిషేధం
శ్రీశైలం టెంపుల్: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం దేవస్థానం మల్లికార్జున కల్యాణ మండపంలో సమీక్షా సమావేశ మందిరంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. గతంలోనూ ప్లాస్టిక్ నిషేధంపై పలుమార్లు అవగాహన సమావేశాలు నిర్వహించామన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయాలను సూచించామన్నారు. సత్రాలు, దుకాణదారులు, హోటల్ నిర్వాహకులు విడివిడిగా రెండు చెత్తకుండీలను ఏర్పాటు చేసుకుని తడి చెత్త, పొడిచెత్తను వేరువేరు కుండీలలో వేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి దేవస్థానం ఇకపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. దేవస్థానం రెవెన్యూ, భద్రతా అధికారులు విస్త్రత తనిఖీలు చేపడతారని, నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం కూడా విధిస్తామన్నారు.
రుద్రవరం: తెలుగుగంగ 22వ బ్లాక్ ఉప ప్రధా న కాల్వకు మళ్లీ గండి పడటంతో వరిపొలాలు నీట మునిగాయి. ఈ కాలువకు కొద్ది రోజుల క్రితం గండి పడటంతో రైతులు విషయాన్ని తెలుగుగంగ అధికారులకు తెలియజేశారు. వారు వెళ్లి గండిని పరిశీలించి మట్టి సంచులతో పూడ్పించారు. ఆ పనులు చేయించి వారు వెళ్లగానే ఆ మట్టి సంచులు కొట్టుకు పోయి తిరిగి గండి ఏర్పడింది. నీరంతా కోత దశలో ఉన్న వరి పొలాలను ముంచెత్తింది. దీంతో వరి పంట దెబ్బతిని పొలాల్లోనే కుళ్లి పోతోంది.
ప్రజాస్వామ్య విలువలపైవిద్యార్థులకు అవగాహన
ప్రజాస్వామ్య విలువలపైవిద్యార్థులకు అవగాహన
ప్రజాస్వామ్య విలువలపైవిద్యార్థులకు అవగాహన


