
నెల రోజులుగా నీటి సరఫరా తగ్గింపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నెల రోజుల నుంచి నీటి సరఫరాను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పట్లో నీటిసరఫరాను పెంచే అవకాశాల్లేవని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నాల్గోగేటు, ఎన్‌సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 6 వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వకు 300, జీఎన్‌ఎస్‌ఎస్(ఎస్సార్భీసీ) కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.