
కన్నీటి పర్యంతం..
‘అమ్మా.. కాలేజీకి వెళ్లి వస్తా అని చెప్పి.. ఇంకా రాలేదు కదా’ అంటూ ఉదయ్ తల్లిదండ్రులు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన గోవింద్, రాధలకు ఇద్దరు కుమారులు. వీరు పట్టణంలో మగ్గం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోహర్ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చాడు. ‘3 గంటల సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని మేము ఇకా ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి.
రోదిస్తున్న ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు