
‘స్ఫూర్తి’దాయకం
శివాజీస్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ దర్శించారు. శివాజీ కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దర్బార్‌లో త్రీడీ చిత్రాలతో ఏర్పాటు చేసిన శివాజీ జీవిత చరిత్రను చూశారు. నావికాదళానికి శివాజీ రాజముద్రను చిహ్నంగా మోదీ ఏర్పాటు చేయగా.. అది దర్బార్‌లో ఉండడంతో చూసిన ప్రధాని చిరునవ్వు చిందించారు. శివాజీ దర్బార్‌ను 1994 అక్టోబరు 16న ప్రారంభించామని, 2025 అక్టోబర్ 16న భారత ప్రధాని సందర్శనకు రావడం విశేషమని నిర్వాహకలు వివరించారు. దీంతో ప్రధాని చిరునవ్వులు చిందించారు. అనంతరం శివాజీ ధ్యానం చేసిన ధ్యాన మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా దర్భార్ హాల్‌లో ఉన్న జీవితవిశేషాలను డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందని ప్రధాని అన్నట్లు నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు.