
బాబూ గారి బిల్డప్ బ్యాచ్!
డోన్: చిత్రంలో భోజనాలు వడ్డిస్తున్న నేతలు బాబూ గారి బిల్డప్ బ్యాచ్ తాలూకాకు చెందిన వారు. వీరు తమ నాయకుడి జన్మదినం పేరిట ప్రభుత్వ పాఠశాలలో హడావుడి గురించి తెలుసుకుంటే వారేవ్వా అనాల్సిందే. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డిస్తూ తమ సొంత ఖర్చులతో భోజనం పెడుతున్నట్లు కలరింగ్ ఇచ్చుకున్న సంఘటన గురువారం ప్యాపిలి మెయిన్ స్కూల్‌లో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కోట్ల జన్మదినం పేరిట పాఠశాలలో ప్రవేశించి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అప్పటికే తయారైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించి తామే సొంత ఖర్చులతో అన్నదానం చేసినట్లు బిల్టప్ ఇవ్వ డం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో రాజకీయ కార్యక్రమాలు చేయరాదనే ఓ వైపు నీతులు చెబుతూనే కూటమి నేతలు ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.