
తీవ్రంగా నష్టపోతాం
ఈ–క్రాప్ విధానాన్ని సక్రమంగా అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర పొందే అవకాశాన్ని కోల్పోతాం. ప్రభుత్వం అందించే రాయితీలు అర్హులకు కాకుండా అనర్హులు పొందే అవకాశం అవకాశం ఉంటుంది. ఇకనైనా ప్రభత్వం ఈ–క్రాప్ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి.
– మధు, రైతు శ్రీరాంగాపురం
ప్రతి సంవత్సరం విత్తనాలు మొదలు పెట్టినప్పటి నుంచే పంట నమోదు జరిగేది. ఈ సంవత్సరం ఈ – క్రాప్ బుకింగ్ చేయమని రోజు అడుగుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మొక్కజొన్న కోయడం జరిగింది. వాటిని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్ నమోదయి ఉండాలి. ఇలా అయితే సేద్యం కష్టమే. – రంగారెడ్డి, గోవిందపల్లె
మా శాఖ పనులు చేసుకోకుండా ఇతర పనులకు అధికారులు ఇష్టానుసారంగా వినియోగించుకుంటు ఒత్తిడికి గురిచేస్తున్నారు. పింఛన్ల పంపిణీతో పాటు అనేక రకాల సర్వేలతో నిత్యం వేధిస్తున్నారు. మళ్లీ గడువులోగా ఈ–క్రాప్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయేతర పనుల నుంచి మమ్మల్ని పూర్తిగా మినహాయించి షెడ్యూల్ ప్రకారం ఈ–క్రాప్ నమోదుకు అవకాశం ఉంటుంది.
– గ్రామ వ్యవసాయ సహాయకుడు

తీవ్రంగా నష్టపోతాం