పంట నష్టపరిహారం.. పంటల బీమా .. పంట రుణాలు.. సున్నా వడ్డీ.. కనీస మద్దతు ధర.. ఇలా వ్యవసా య పథకాలకు ప్రభుత్వం నుంచి రైతులు రాయితీలు పొందాలన్నా ఈ–క్రాప్‌ నమోదు కీలకం. ఇలాంటి ప్రక్రియ నంద్యాల జిల్లాలో నత్తనడకన సాగుతోంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం | - | Sakshi
Sakshi News home page

పంట నష్టపరిహారం.. పంటల బీమా .. పంట రుణాలు.. సున్నా వడ్డీ.. కనీస మద్దతు ధర.. ఇలా వ్యవసా య పథకాలకు ప్రభుత్వం నుంచి రైతులు రాయితీలు పొందాలన్నా ఈ–క్రాప్‌ నమోదు కీలకం. ఇలాంటి ప్రక్రియ నంద్యాల జిల్లాలో నత్తనడకన సాగుతోంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం

Sep 19 2025 1:41 AM | Updated on Sep 19 2025 1:41 AM

పంట న

పంట నష్టపరిహారం.. పంటల బీమా .. పంట రుణాలు.. సున్నా వడ్డ

ల్యాండ్‌ పార్శిల్స్‌ మేరకు జిల్లాలో ఈ నెల 16వ తేదీకి మండలాల వారీగా ఈ క్రాప్‌ నమోదు శాతం ఇలా..

నాట్లు వేస్తున్న దృశ్యం

రీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నాలుగు నెలలవుతోంది. మరో 12 రోజుల్లో సీజన్‌ ముగుస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో వైపు ముందస్తు సాగు చేసిన పంటలు కోతకు రావడంతో నూర్పిళ్లు మొదలవుతున్నాయి. అయినా రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ – క్రాప్‌ నమోదుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఈ–క్రాప్‌ నమోదు 19 శాతం కూడా దాటలేదు. దీంతో ఖరీఫ్‌లో పంటలు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. పంట నమోదు కాకపోవడంతో విపత్తుల సమయంలో పరిహారం, పంట అమ్మకాల సమయంలో ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. పంటలతో సంబంధం లేకుండా ప్రతి ఎకరా భూమిని సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 7,73,150 ల్యాండ్‌ పార్శిల్స్‌ ఉండగా ఇప్పటి వరకు 1,47,781 ల్యాండ్‌ పార్శిల్స్‌ మాత్రమే పంట నమోదు పూర్తయింది. ఇంకా 81 శాతానికి పైగా ల్యాండ్‌ పార్శిల్స్‌కు ఈ–క్రాప్‌ నమోదు కావల్సి ఉంది. ఈ నెల 30వ తేదీలోపు అంటే మరో 12 రోజుల్లో ఈ–క్రాప్‌ నమోదు గడువు పూర్తి కానుంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది లక్ష్యానికి చేరుకునేందుకు మల్లగుల్లాలు పడుతుండగా గడువులోపు పంట నమోదు కాకుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతుందున్నారు.

శాఖల మధ్య సమన్వయ లోపం..

పంటల నమోదు రెవెన్యూ, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పూర్తి చేయాల్సి ఉంది. రైతులతో కలిసి పంట పొలాలకు వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట వివరాలు, సర్వే నంబర్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసి పూర్తిగా ధ్రువీకరణ చేసిన తరువాతే ఈ – క్రాప్‌ పూర్తి చేయాలి. కానీ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీనికితోడు వీఏఏల బదిలీల నేపథ్యంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. అక్కడక్కడా కొందరు వ్యవసాయ సిబ్బంది మాత్రమే ప్రక్రియను మమ అనిపిస్తున్నారు. దీంతో ఈ–క్రాప్‌ నమోదులో స్పష్టత ఎంత వరకూ..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నిర్లక్ష్యం తీరిది..

● మారిన నిబంధనల ప్రకారం ఈ సారి సర్వే నంబర్ల వారీగా జియో మ్యాపింగ్‌ చేసి, ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఈ తంతంగం క్షేత్రస్థాయిలో పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతోంది. సాంకేతిక సమస్యలతో ముందుకు సాగడం లేదు.

● యూరియా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాపుస్తుండటంతో పంపిణీ చేసేందుకు సిబ్బంది అక్కడే ఉండటం పంట నమోదుపై దృష్టి పెట్టలేక పోతున్నారు.

● భూములు సర్వే జరిగిన గ్రామాల్లో ఎల్‌పీ నంబర్లకు వ్యవసాయశాఖ సిబ్బంది దగ్గరున్న సర్వే నంబర్లకు సరిపోక పోవడంతో సమస్య ఎదురవుతోంది.

● బయోమెట్రిక్‌ పడని రైతులకు ఐరీస్‌ చేయడానికి సిగ్నల్స్‌ సమస్య వేధిస్తోంది.

● వెబ్‌ల్యాండ్‌ నుంచి ప్రభుత్వ భూమి లేదా అభ్యంతరకర సర్వే ఖాతా నంబర్లు డౌన్‌లోడ్‌ అయితే వ్యవసాయేతర భూమిగా పరిగణించి నమోదు చేయాల్సి ఉంది. వెబ్‌ల్యాండ్‌, అటవీ భూముల్లో పంటలు ఉన్నా, లేకపోయినా ఫీల్డ్‌ సర్వే చేయాలి. బీడు భూములను అయిదేళ్లకు పైగా సాగు చేయనివి, 1–5 ఏళ్ల మధ్య చేయనివి, ఈ ఏడాది మాత్రమే చేయనివిగా విడదీయాలి.

● ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యం 5,95,535 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,33,460 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

● ఇప్పటి వరకు 1,01,357.4 ఎకరాల్లో మాత్రమే పంటల నమోదు చేశారు.

మండలాల్లో

20 నుంచి

29 శాతం

5

(జిల్లాలో 7,73,150 ల్యాండ్‌ పార్శిల్స్‌ కాగా ఇప్పటి వరకు

1,44,781 ల్యాండి పార్శిల్స్‌లోనే పంట నమోదు)

మండలాల్లో

30 నుంచి

29 శాతం

8

మండలాల్లో

1 నుంచి

9 శాతం

4

ఉయ్యాలవాడ,

ప్యాపిలి,

కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల

ఆత్మకూరు, డోన్‌, గోస్పాడు, జూపాడుబంగ్లా, మహానంది

మిడ్తూరు, బండిఆత్మకూరు, బేతంచెర్ల, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, పాణ్యం, వెలుగోడు

మండలాల్లో

10 నుంచి

19 శాతం

11

ఆళ్లగడ్డ, బనగానపల్లె, దొర్నిపాడు, గడివేముల, కొత్తపల్లె,

నంద్యాల, అవుకు, చాగలమర్రి, రుద్రవరం, సంజామల, శిరివెళ్ల

జిల్లాలో నత్తనడకన ఈ–క్రాప్‌ నమోదు

ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు

మరో 12 రోజుల్లో 81 శాతం

నమోదు సాధ్యమేనా ?

ఇప్పటికే మొదలైన పంట కోతలు

ఈ–క్రాప్‌ నమోదు లేక

రైతుల్లో ఆందోళన

పంట నష్టపరిహారం.. పంటల బీమా .. పంట రుణాలు.. సున్నా వడ్డ1
1/1

పంట నష్టపరిహారం.. పంటల బీమా .. పంట రుణాలు.. సున్నా వడ్డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement