
25న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశం
కర్నూలు (టౌన్): స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఈనెల 25వ తేదీన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం ఇన్‌చార్జ్ ఉప్పల యోబు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు (కర్నూలు), తిరుపతయ్య (నంద్యాల) తెలిపారు. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపు నిచ్చారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దళితులను రాజకీయంగా అభివృద్ధి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీల సంక్షేమాన్నిన నీరుగార్చిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్లు అలంకారప్రాయంగా మారాయన్నారు. ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నెమరకల వెంకటేష్, నగర అధ్యక్షుడు కమతం పరుశురామ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ప్రభుదాసు, కార్యదర్శి కాశపోగు శ్రీకాంత్, శివ, కార్యవర్గ సభ్యులు పండు, వంశీ క్రిష్ణ, హరిప్రసాద్ పాల్గొన్నారు.