
ఘనంగా విశ్వకర్మ జయంతి
నంద్యాల: కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో, జిల్లా ఎస్పీ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య మాట్లాడుతూ.. విశ్వకర్మ వల్లే చేతివృత్తులు అభివృద్ధి చెందాయన్నారు. కలెక్టరేట్ ఏవో సుభాకర్, అసిస్టెంట్ బీ వెల్ఫేర్ ఆఫీసర్ ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కష్టపడే తత్వం, పట్టుదల, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే సందేశాన్ని విశ్వకర్మ ద్వారా మనం నేర్చుకోవచ్చని అడిషనల్ ఎస్పీ తెలిపారు.