
పొలం నిండా కన్నీళ్లే!
గిట్టుబాటు ధర లేక.. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే ఆశ లేక రైతులు ఉల్లి పంటపై ఆశలు వదులుకున్నారు. పంటను పీకి పొలంలోనే వదిలేస్తున్నారు. మండల పరిధిలోని గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన కౌలు రైతు పెద్ద రంగన్న 15 రోజుల క్రితం ఉల్లి పంట పీకి పొలంలోనే వదిలేశాడు. ఐదు ఎకరాల్లో ఉల్లి సాగుచేస్తే రెండు ఎకరాల ఉల్లిని అరకొరగా విక్రయించడు. మిగిలిన మూడు ఎకరాల ఉల్లి పంటను గిట్టుబాటు ధర లేక పొలంలోనే వదిలేశాడు. పంట సాగుతో దాదాపు రూ.4 లక్షల వరకు నష్టం వచ్చినట్లు రైతు వాపోతున్నాడు.
– ఎమ్మిగనూరు రూరల్