
అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి
● జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమంలో డీఆరోతో పాటు డీఆర్‌డీఏ పీడీ, తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లా డుతూ.. పీజీఆర్‌ఎస్‌లో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై తహసీల్దారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, డీఈఓ జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
22 నుంచి శరన్నవరాత్రోత్సవాలు
● ఈ ఏడాది మూలమూర్తి
శ్రీ కామేశ్వరీదేవికి అలంకార పూజలు
మహానంది: మహానంది క్షేత్రంలో ఈనెల 22వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక కల్యాణ మండపంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజువారి అలంకారాలతో పాటు గ్రామోత్సవం ఉంటుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తొలిసారి మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి మూలమూర్తికి నిత్యం ఒక అలంకారం చేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లు వెలిసిన ఆలయం కావడంతో వచ్చే నెల 2వ తేదీన అమ్మవారు శివకామేశ్వరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో వేదపండితు లు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధా న అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, ఉప ప్రధాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంపీడీఓలకు
నేడు, రేపు శిక్షణ
కర్నూలు(అర్బన్): మండల, గ్రామ పంచాయతీల్లో ‘సొంత ఆదాయ వనరులు’ అనే అంశంపై ఈ నెల 16, 17వ తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 మండలాలకు చెందిన ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ, డీపీఆర్‌సీ ప్రిన్సిపాల్ జీ నాసరరెడ్డి తెలిపారు. ఏపీఎస్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణలో సొంత ఆదా య వనరుల సృష్టి, సొంత ఆదాయంలో పన్ను వనరులు, పన్నుల వసూళ్లలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
ఎట్టకేలకు డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్టు విడుదల
● మిగిలిపోనున్న 88 పోస్టులు
కర్నూలు సిటీ: నిరుద్యోగ అభ్యర్థులను ఊరించిన డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్టు ఎట్టకేలకు సోమవారం విడుదలైంది. డీఎస్సీ ప్రకటన జారీ చేసినప్పటి నుంచి అనేక వివాదాలు, ఆందోళనల మధ్య ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యలో 2,645, ఆశ్రమ పాఠశాలల్లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అయితే సర్టిఫికెట్ల పరిశీలనలో 2,590 పోస్టులకు మాత్రమే అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వనున్నట్లు ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 88 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగాలకు ఎంపికై న వారందరూ గత నెలలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న సెంటర్లకు 18వ తేదీ ఉదయం 7 గంటలకు రిపోర్టు చేసుకోవాలని, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అభ్యర్థులతో పాటు ఒకరు సహాయకులుగా విజయవాడకు బయలుదేరి వెళ్లాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ప్రకటన జారీ చేశారు.

అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి