
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం
పగిడ్యాల: ప్రజలకు జవాబుదారీగా విధులు నిర్వహించాల్సిన సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా కార్యాలయానికి తాళాలు వేయకుండా వెళ్లిన ఉదంతం సోమవారం నెహ్రూనగర్ సచివాలయం 2లో చోటుచేసుకుంది. దాదాపు 13 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నా వారి మధ్య సమన్వయం లేకపోవడంతో కార్యాలయానికి తాళం వేయకుండా ఇళ్లకు వెళ్లిపోయారు. సచివాలయంలో విలువైన కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, బీరువాలు, రికార్డులు ఉన్నప్పటికీ తమవి కాదన్నట్లు వెళ్లిపోవడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తాళం వేయలేని సంగతిని గుర్తించిన గ్రామస్తులు వీఆర్‌ఏకు సమాచారం అందించడం కార్యాలయానికి వేరే తాళం వేశారు. ఈ విషయమై ఎంపీడీఓ నాగేంద్రకుమార్‌ను అడుగగా.. విషయం తన దృష్టికి వచ్చిందని నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని వెల్లడించారు.