
ట్రాక్టర్‌ను తగులబెట్టిన దుండగులు
సి.బెళగల్: పెట్రోల్ పోసి ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టినట్లు బాధితులు తెలిపారు. కె.సింగవరం గ్రామానికి చెందిన తెలుగు రంగన్న ట్రాక్టర్‌తో గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పనిముగించు కుని తెలుగు రంగన్న కుమారుడు మహేష్.. ట్రాక్టర్‌ను ఈశ్వరామాలయం వెనుక ప్రాంతంలో వదిలి ఇంటికి వెళ్లాడు. రాత్రి 10:30 గంటల సమయంలో ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తెలుగు రంగన్న కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేయగా అప్పటికే ట్రాక్టర్ ఇంజిన్ కాలిపోయింది. బాధిత రైతు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
బండి ఆత్మకూరు: అదనపు కట్నం కోసం మహిళను వేధించిన భర్త, అత్తపై సోమవారం కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. లింగాపురం గ్రామానికి చెందిన షేక్ మాబున్నికి 16 ఏళ్ల క్రితం కల్లూరుకు చెందిన అన్వర్‌తో వివాహమైంది. కాగా తరచూ అదనపు కట్నం కోసం మాబున్నిని భర్త, అత్త షేక్ బీబీ అదనపు కట్నం వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
నంద్యాల(అర్బన్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శిరివెళ్ల మండలం కామినేనిపల్లె గ్రామానికి చెందిన కుమ్మరి నరసింహులు(37) కుటుంబ కలహాలతో చాబోలు గ్రామానికి చేరుకుని పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను స్థానికులు గమనించి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం అతనికి వివాహమైంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్వింటా వేరుశనగ రూ.8,000
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధరలు కొంతమేర పెరిగాయి. మార్కెట్‌కు వేరుశనగ 125 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.3,806, గరిష్ట ధర రూ.8 వేలు లభించగా... సగటు ధర రూ.7,419 నమోదైంది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ కనిష్ట ధర రూ.3,149, గరిష్ట ధర రూ.6,970 లభించగా... సగటు ధర రూ.6,490 నమోదైంది. ఒకే జిల్లాలో మార్కెట్‌కు మార్కెట్‌కు మధ్య ధరల్లో భారీ వ్యత్యాసం కనిపించింది.