
గంజాయి పట్టివేత
కర్నూలు: నగర శివారులోని పంచలింగాల ఎకై ్సజ్ చెక్‌పోస్టులో వాహన తనిఖీల సందర్భంగా గంజాయి పట్టుబడింది. కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్, ఎస్‌ఐ దుర్గా నవీన్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అలంపూర్ వైపు నుంచి బొలెరో వాహనం వచ్చింది. అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వాహనం ఆపి తనిఖీ చేయగా 440 గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. వాహనంలో ఉన్న కర్నూలు టీచర్స్ కాలనీకి చెందిన ఈడిగ శ్రీనివాసులు గౌడ్, చైతన్య నగర్‌కు చెందిన బండ శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్ నుంచి గంజాయి తీసుకువస్తున్నట్లు అంగీకరించారు. చిన్న పొట్లాలుగా తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో తెచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఇరువురిని ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించి వాహనంతో పాటు గంజాయిని సీజ్ చేశారు. ఇరువురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది రంగయ్య, చంద్రపాల్, రామలింగయ్య, సుదర్శన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత