
శ్రీశైలంలో పట్టుబడిన మద్యం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీగా మద్యం పట్టుబడింది. కర్ణాటక రాష్ట్ర ఆర్టీసీ బస్సులో వచ్చిన బుజ్జి బాయిని తనిఖీ చేసిన పోలీసులు 200 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలానికి చెందిన బుజ్జిబాయి, అమెకు సహకరించిన మహబూబ్‌నగర్ జిల్లా ఐనవోలు మండలం కొర్రతాండకు చెందిన కేతావత్ శాంతిలను అరెస్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లికి చెందిన బి.చెన్నయ్య వద్ద 97మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ జి. ప్రసాదరావు తెలిపారు.