
విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు నరసింహరాజు
ఈ చిత్రంలో మోటారు సైకిల్‌పై ఉన్న ఉపాధ్యాయుడు నరసింహరాజు. ఈయన దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డినగరం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలు లక్ష్మితేజ (5వ తరగతి), అభినవ్‌తేజ (2వ వతరగతి)ను మోటారు సైకిల్‌పై తాను పనిచేసే ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు.
శిరివెళ్ల మండలం యర్రగుంట్ల నుంచి అమ్మిరెడ్డినగరంకు మోటారు సైకిల్‌పై విద్యార్థులను తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు కదా.. మీరెందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా ‘తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించినట్లు’ చెప్పారు. తన పిల్లలకు తానే చదువు నేర్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. – దొర్నిపాడు

యర్రగుంట్ల నుంచి అమ్మిరెడ్డినగరంకు మోటారు సైకిల్‌పై