
6,588 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వేలం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలను మంగళవారం వేలం వేశారు. రూ.50, రూ.70, రూ.100 గరిష్టంగా రూ.360 ధర లభించింది. 6, 588 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు అమ్మకమయ్యాయి. 1,434 క్వింటాళ్ల ఉల్లి గడ్డలను కొనుగోలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రాకపోవడంతో డంప్ యార్డుకు తరలించనున్నారు. ఇప్పటికే ఉల్లి నాణ్యత పూర్తిగా దెబ్బతిని నీళ్లూరుతోంది.
రేపు, ఎల్లుండి ఎమ్మిగనూరులో ఉల్లి కొనుగోళ్లు
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి తాకిడిని తగ్గించేందుకు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు చేపట్టనున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లకు విరామం ఇచ్చిన రోజుల్లో అక్కడ కొనుగోళ్లు చేపట్టే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 17వ తేదీ కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిని బయటికి తరలించేందుకు రెండు రోజుల పాటు సమయం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 18, 19 తేదీల్లో మార్కెట్‌కు రైతులు ఉల్లిగడ్డలు తీసుకురాకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ నవ్య కమీషన్ ఏజెంట్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆ రెండు రోజులు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లు చేపడతామని మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి తెలిపారు.
వెల్దుర్తి: తున్న అంతర్ జిల్లాల దొంగను అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం బుగ్గ సంగాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.కాగా పట్టుబడిన బైక్‌ల దొంగ పింజరి షేక్షావలి వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్ నగరం గ్రామ టీడీపీ కార్యకర్త. గతంలో బుక్ కీపర్‌గా విధులు నిర్వహించిన ఇతను కర్నూలు, అనంతపురం జిల్లాలలో బైక్‌ల చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. అయితే, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఈ దొంగను ఈనెల 15వ తేదీన బుగ్గ సంగాల వద్ద కసాపురం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి విలువైన బజాజ్ పల్సర్ 125 సీసీ బైక్‌లు నాలుగు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎన్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.