
నేత్రదానం పుణ్యకార్యక్రమం
నేత్రదానం చేయడం పుణ్యకార్యక్రమంతో సమానం. ప్రపంచంలో 4 నుంచి 6 శాతం మంది కార్నియా జబ్బుతో బాధపడుతున్నారు. ఇందులో 0.36శాతం భారతీయులే ఉన్నారు. దీనిని ఈ ఏడాది చివరి నాటికి 0.25శాతానికి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం. దేశంలో ఏటా 47,676 మంది నుంచి కార్నియా సేకరిస్తున్నారు. వాటిలో 29,057 వినియోగిస్తున్నారు. మిగిలినవి వివిధ కారణాల వల్ల నిరుపయోగమవుతున్నాయి. నేత్రదానం సమయంలో మొత్తం కన్ను గాకుండా నల్లగుడ్డు (కార్నియా) మాత్రమే తీస్తారు. దాని స్థానంలో కృత్రిమ కళ్లను మరణించిన వారికి అవయవలోపం కనిపించదు. దాతలు ఇచ్చిన నేత్రాలను విక్రయించడం, కొనడం జరగదు. ఇతరులకు ఉచితంగా అమరుస్తారు.
– డాక్టర్ పి. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి, కర్నూలు