
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
● డీజే శబ్దానికి కూలిన మట్టిమిద్దె ● తప్పిన ప్రాణపాయం
కోవెలకుంట్ల: మేజర్ గ్రామ పంచాయతీ కోవెలకుంట్లలో వినాయక నిమజ్జనంలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. పట్టణంలోని ఆయా కాలనీల్లో కొలువుంచిన గణనాథులను పట్టణ శివారులోని కుందూనదిలో నిమజ్జనం చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డీజే, డ్రమ్స్ మధ్య ఊరేగింపు నిర్వహించారు. సంతమార్కెట్ సమీపంలో ఊరేగింపు వెళుతున్న సమయంలో డీజే శబ్దానికి బుగ్గరపు లక్ష్మయ్యకు చెందిన పాత ఇల్లు కూలింది. ఇంటి ముందు వారపాకతో పాటు మరో గది నేలకూలింది. ఆ సమయంలో లక్ష్మయ్యతోపాటు ఆయన భార్య వెంకటరత్నమ్మ లోపలి గదిలో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు నేలకూలడంతో స్థానికులు హుటాహుటినా ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ వృద్ధ దంపతులు

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి