
శాస్త్రోక్తంగా స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో స్వాతి మహోత్సవాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను అమృతవల్లీ అమ్మవార్లను దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.