
హైవేపై బోల్తా పడిన తూఫాన్ వాహనం
ఐదుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు
పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీ య రహదారిపై బలపనూరు గ్రామం వద్ద టైరు ఊడిపోయి తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం కర్నూలు నుంచి తుఫాన్ వాహనంలో డ్రైవర్ కేశవతో పాటు మరో 11 మంది నంద్యాలకు బయలుదేరారు.
మార్గమధ్యలో బలపనూరు దాటిన తర్వాత తిరుమల గిరి వద్ద వాహనం వెనుక వైపు టైరు ఊడిపోవడంతో అవతల రోడ్డు పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కర్నూలు విద్యా నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు రాంబాబు, విజయవాడకు చెందిన రహిమాన్, ఉపా ధ్యాయుడు నాగరాజు, పుట్టపర్తికి చెందిన సాయికృష్ణ, డ్రైవర్ కేశవకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహ నాన్ని తొలగించారు.