ఆస్పరి: మేజర్ గ్రామ పంచాయతీ ఆస్పరి దినసరి కూరగాయల మార్కెట్ వేలం రికార్డు స్థాయిలో రూ. కోటి పలికింది. శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మూలింటి రాధమ్మ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి సంబంధించి దినసరి కూరగాయల మార్కెట్ వే లాన్ని పంచాయతీ కార్యదర్శి విజయరాజు నిర్వహించారు. ఇందులో 9 మంది పాట దారులు రూ. 5 లక్షలు సాల్వె న్సీ, రూ. 2 లక్షలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. వేలం పోటాపోటీగా సాగింది.
చివరకు ముల్లా మెహబూబ్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఎక్కువ ధర పాడి మార్కెట్ హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 65 లక్షలు పలకగా ఈసారి కోటి రూపా యలు పలకడంతో పంచాయతీకి రూ.35 లక్షల ఆదాయం పెరిగింది. ఆస్పరి మార్కెట్ చరిత్రలోనే ఎక్కువ పాడిన మొత్తంగా నిలిచింది. వేలంలో ఎంపీడీఓ గీతావాణి, ఉప సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్పరి సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
బార్ల అనుమతులకు నేడు లక్కీ డిప్
కర్నూలు: జిల్లాలో మద్యం బార్ల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌కు ఆశావహుల నుంచి స్పందన అంతంత మాత్రమే వచ్చింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మూడేళ్ల కాల పరిమితితో కర్నూలులో ఓపెన్ కేటగిరీ కింద 16, గౌడ కులాలకు 2, ఆదోనిలో ఓపెన్ కేటగిరీ కింద 4, గౌడ కులాలకు 1, ఎమ్మిగనూరులో 2, గూడూరులో ఒకటి చొప్పున మొత్తం 26 బార్లకు లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. కనీసం 4 దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తామని ఎౖక్సైజ్ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ లెక్కన గడువు ముగిసే సమయానికి ఓపెన్ కేటగిరీ కింద ఉన్న 23 బార్లకు గాను 15 బార్లకు 60 దరఖాస్తులు, గౌడ కులాలకు రిజర్వు చేసిన 3 బార్లకు 17 దర ఖాస్తులు వచ్చాయి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మరో 5 బార్లకు, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, గూడూరులో ఒకటి బార్ ఏర్పాటుకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. జెడ్పీ సమావేశ భవనంలో లక్కీడిప్ నిర్వహణకు ఎక్సై జ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మద్యం బార్ల ఏర్పాటుకు లైసెన్సుల జారీకి శనివారం ఉదయం 8 గంటలకు లక్కీ డిప్ నిర్వహించను న్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషాతో పాటు ఎక్సైజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి సుధీర్ బాబు సమక్షంలో లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు లైసెన్స్‌లు జారీ చేయనున్నారు.