
సింగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులను పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ిసంగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ, జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీ, పావలావడ్డీ, విద్యుత్, సేల్ టాక్స్ తదితరాలలో రాయితీ ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు. గత త్రైమాసిక కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం 139 దరఖాస్తులు రాగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 131 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయన్నారు. మిగ తా 8 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. జిల్లాలో స్కిల్ హబ్స్, ఈఎస్‌ఈలలో జాబ్ మేళాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంత మంది యువత నైపుణ్య శిక్షణను పొందుతున్నారన్న అంశాన్ని వెబ్‌సైట్‌లో కలెక్టర్ పరిశీలించి, ప్రగతి సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా 2025లో నిర్వహించే జాబ్ మేళా బ్రోచర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ఎస్.మహబూబ్ బాషా, నైపుణ్య అభివృద్ధి శిక్షణా అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, ఎల్డీఎం రవీందర్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాజమహేంద్రనాథ్ పాల్గొన్నారు.