వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,675 కోట్ల పరిహారం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,675 కోట్ల పరిహారం

Aug 6 2025 6:56 AM | Updated on Aug 6 2025 6:56 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,675 కోట్ల పరిహారం

కర్నూలు(అగ్రికల్చర్‌): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం(2019–20 నుంచి 2023–24)లో ఎలాంటి షరతులు లేకుండా నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు బీమా వర్తించింది. ఈ ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే. నేడు రైతుల ఆశలను ఇటు కూటమి ప్రభుత్వం.. అటు బ్యాంకులు దెబ్బతీస్తున్నాయి. ఉచిత పంట బీమాకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడంతోనే రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు స్వస్తి పలికి ప్రీమియం చెల్లించి బీమా పొందే విధానాన్ని అమలులోకి తీసుకరావడంతోనే 90 శాతం పైగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. కొంతమంది రైతులు బీమా కోసం ప్రీమియం చెల్లించేందుకు ముందుకొచ్చినా సర్వర్‌ పనిచేయకపోవడంతో నిరాశతో వెనుతిరిగే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన కొందరు రైతులు ప్రీమియం చెల్లించినప్పటికీ బీమాను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. రైతుల అమాయకత్వం, లోనింగ్‌ను పెంచుకోవాలనే తపనతో బ్యాంకులు రైతులను బీమాకు దూరం చేస్తున్నాయి.

స్కేల్‌ ఆఫ్‌ ౖఫైనాన్స్‌ ఎక్కువ ఉన్న పంటలకే రుణాలు

బ్యాంకులు లోనింగ్‌ పెంచుకునేందుకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌(రుణ పరిమితి) ఎక్కువ ఉన్న పంటలకే రుణాలు ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాధారం కింద సాధారణంగా కంది, సజ్జ, జొన్న, కొర్ర, ఆముదం వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ తక్కువ. రైతులు ఏ పంట వేశారు.. ఏ పంట వేస్తున్నారో పక్కాగా తెలుసుకొని ఆ పంటకు మాత్రమే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకా రం పంట రుణం ఇవ్వాలి. కానీ ఏ బ్యాంకు కూడా వాస్తవంగా సాగు చేసిన పంటలకు రుణాలు ఇవ్వని పరిస్థితి. సాగు చేయని పంటలకు రుణాలు ఇస్తున్నాయి. ఎండు మిర్చికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎక్కువ. ఈ పంటకు ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.25 లక్షల వర కు ఉంది. బ్యాంకులు లోనింగ్‌ను పెంచుకునేందుకు ఎండుమిర్చి పంట పేరుతో పంట రుణాలు ఇస్తున్నాయి. రైతులు కూడా ఎక్కువ మొత్తంలో లోన్‌ వచ్చిందని తాత్కాలికంగా సంతోషపడుతున్నారు. పంటల బీమా సాయం దక్కనప్పుడు ఏ స్థాయిలో నష్టపోతున్నారో ఊహించలేకపోతున్నారు.

బీమా చేసుకున్న రైతులు 26,955 మందే!

కర్నూలు జిల్లాలో 3.75 లక్షల మంది రైతులుండగా జూలై నెల 31 నాటికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద 11,438 మంది రైతులు మాత్రమే ప్రీమి యం చెల్లించారు. నంద్యాల జిల్లాలో 3.25 లక్షల మం

ది రైతులు ఉండగా 220 మంది మాత్రమే ప్రీమి యం చెల్లించడం గమనార్హం. వాతావరణ ఆధారిత బీమా కింద కర్నూలు జిల్లాలో 11,056, నంద్యాల జిల్లాలో

4,241 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లి ంచారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న వారిలో వాతావరణ ఆధారిత బీమా కోసం కర్నూలు జిల్లాలో 16,666, నంద్యాల జిల్లా నుంచి 7,156 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కింద కర్నూలు జిల్లాలో 3,740, నంద్యాల జిల్లాలో 266 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బ్యాంకులు రైతులకు ఇచ్చే పంట రుణంలో ప్రీమియం కట్‌ చేసి బీమా కంపెనీలకు బదిలీ చేస్తారు. ప్రీమియం చెల్లించిన రైతుల్లో 90 శాతం మంది రైతులు కంది, సజ్జ, కొర్ర, జొన్న పంటలే సాగు చేశారు. అయితే బ్యాంకు ల్లో మాత్రం మిర్చికి పంట రుణం పొందినట్లు ఉంటు ంది. ఈ పరిస్థితి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఉంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐదేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉమ్మడి జిల్లాలో రూ.1,675 కోట్ల బీమా పరిహారం మంజూరైంది. పంట రుణాలతో సంబంధం లేదు.. మీ సేవ కేంద్రాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, బ్యాంకులకు వెళ్లి ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి లేకపోయింది. సర్వర్‌ సమస్యలు లేవు. కేవలం నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు బీమాకు అర్హత లభించింది. తాజా పరిస్థితులతో రైతులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శక పాలనను గుర్తు చేసుకొని తాము ఏం కోల్పోయామో చర్చించుకుంటున్నారు.

రుణం పొందిన పంటే

ఈ–క్రాప్‌లో ఉండాలి

పంటల బీమా పరిహారం పొందడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బీమా పరిహారం మంజూరు చేసే సమయంలో వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రైతులు సాగు చేసిన లేదా సాగు చేసే పంటకే రుణం తీసుకోవాలి. ఆ పంట విధిగా ఈ–క్రాప్‌లో నమోదు కావాలి. అప్పుడే పరిహారం లభించే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో ఒక పంటకు రుణం తీసుకొని.. మరో పంట ఈ–క్రాప్‌లో నమోదైతే అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితుల్లో బీమా పరిహారం కోల్పోతారు. రైతులు ఏ పంట సాగు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకొని ప్రీమియం కట్‌ చేయాలని అన్ని బ్యాంకులకు సూచించాం.

– రామచంద్రరావు, ఎల్‌డీఎం, కర్నూలు

లోనింగ్‌ పెంచుకోవడంపైనే బ్యాంకర్ల దృష్టి

స్కేల్‌ ఆఫ్‌ ౖఫైనాన్స్‌ ఎక్కువున్న పంటలకే రుణాలు

బ్యాంకులో ఒక పంట.. ఈ క్రాప్‌లో మరో పంట

అధిక శాతం మిర్చి పేరిటే లోన్లు

సాగు చేస్తున్న పంటలు కంది, సజ్జ, ఆముదం, జొన్న, కొర్ర

అతివృష్టి, అనావృష్టి సమయంలో దక్కని బీమా

బీమాను పట్టించుకోని

90 శాతం పైగా రైతులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,675 కోట్ల పరిహారం 1
1/1

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,675 కోట్ల పరిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement