
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బదులుగా మద్యాన్ని డోర్‌డెలివరీ చేస్తుండటంతో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని కూటమి నేతలు మద్యపాన రాష్ట్రంగా మార్చడంతో నేరాల సంఖ్య పెరిగి పోతుందన్నారు. మద్యం మత్తులో కామాంధులు బరితెగిస్తున్నారన్నారు. సోమవారం స్థానిక ఉదయానంద హోటల్‌లో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్యెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాట సాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాఽథ్‌రెడ్డి, నందికొట్కూరు ఇన్‌చార్జ్ దారా సుధీర్‌కుమార్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు ఒంటరిగా తిరగలేని పరిస్థితిని కూటమి నేతలు తీసుకొచ్చారన్నారు. చాగలమర్రికి చెందిన నాలుగేళ్ల చిన్నారి గుడికి వెళితే మద్యం మత్తులో ఉన్న కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో చిన్నారులు గుడికి, బడికి వెళ్లినా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఏరులై పారుతుండటం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను అరికట్టాలని చిన్నారి తల్లి ఆవేదన చెందటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని ఎన్నికల ముందు కూటమి నేతలు గగ్గోలు పెట్టారని తీరా అధికారంలోకి వచ్చాక మహిళల ప్రాణాలకు సైతం రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఊరూరా మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాలు 24 గంటలు కొనసాగుతున్నాయన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలుగా నియమించటం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నుంచి నేతల దాకా అందరినీ సమన్వయ పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యకర్తలకు ధైర్యం నింపుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామన్నారు.
విచ్చలవిడి మద్యం అమ్మకాలతో
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు
వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్
పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి