
కమిషనర్‌కు అస్వస్థత
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్య ఉండటంతో వైద్య పరీక్షలు నిమిత్తం మంగళవారం స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం స్టంట్ వేసినట్లు తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమిషనర్‌ను పలువురు పరామర్శించారు. జేసీ విష్ణుచరణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసాతో పాటు అధికారులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు మాట్లాడుతూ కమిషనర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.