
వినతుల పరిష్కారంపై శ్రద్ధ చూపండి
నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన వినతులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీఓపెన్ అయిన 48 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 1,374 ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సర్వే లలో భాగంగా మన మిత్ర క్యాంపెయిన్ కు సంబంధించి ఇంకా 12,724, సిటిజన్ ఈకేవైసీ 2,23,024, చిల్డ్రన్ వితౌట్ ఆధార్ 6,554, హౌసింగ్ ఇమేజ్ జియో కోఆర్డినేట్‌కు సంబంధించి 622 పెండింగులో ఉన్నా యని వాటిని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో 246 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రామునాయక్ ్ల తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి