సర్దుబాటు పేరిట భారం తగదు | - | Sakshi
Sakshi News home page

సర్దుబాటు పేరిట భారం తగదు

Mar 9 2025 1:05 AM | Updated on Mar 9 2025 1:05 AM

సర్దు

సర్దుబాటు పేరిట భారం తగదు

రెండు మూడేళ్ల క్రితం వినియోగించిన కరెంటుకు కూడా ఇప్పుడు సర్దుబాటు పేరుతో భారం వేయడం తగదు. మే ము ఫిబ్రవరిలో 96 యూనిట్ల కరెంటు మాత్రమే వా డాము. ఇందుకు చార్జీ రూ.206, ఫిక్స్‌డ్‌ చార్జి రూ.10, కస్టమర్‌ చార్జీ రూ.40 మాత్రమే చెల్లించా ల్సి ఉంది. అయితే రూ.520 బిల్లు ఇచ్చారు. 2022–23 సంవత్సరాల్లో వాడిన ప్రతి యూనిట్‌కు నిబంధనల ప్రకారం బిల్లు చెల్లించాం. ఇప్పుడు మళ్లీ అదనపు చార్జీలు వసూలు చేయడం దారుణం.

– గోవిందరాజులు, రాంపురం, తుగ్గలి మండలం

చార్జీలు పెంచమని

మోసగించారు

కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. మేము 135 యూనిట్ల విద్యుత్‌ వాడాము. ఇందుకు రూ.477 చార్జి, ఫిక్స్‌డ్‌ చార్జి రూ.10, కస్టమర్‌ చార్జి రూ.40తో కలిపి చెల్లించాల్సి ఉంది. అయితే 2022 బకాయి అని రూ.103, 2023 బకాయి అని రూ.57, తాజా వాడకానికి సంబంధించి రూ.33.50, సర్‌చార్జి రూ.25, ట్రూ అప్‌ చార్జి రూ.52 భారం వేశారు. మొత్తం 830 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. వాడిన వినియోగానికి ఇది రెట్టింపు.

– సగిలే కృష్ణారెడ్డి, లింగాపురం, బండిఆత్మకూరు

సర్దుబాటు పేరిట  భారం తగదు 
1
1/1

సర్దుబాటు పేరిట భారం తగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement