లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

Mar 9 2025 1:05 AM | Updated on Mar 9 2025 1:05 AM

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

నంద్యాల(వ్యవసాయం): లోక్‌ అదాలత్‌తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడవ అదనపు జిల్లా జడ్జి, లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వాసు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధారాణి, ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి లక్ష్మి అన్నారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో నంద్యాల పరిధిలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఎస్‌టీసీ కేసులు 694, సీసీ కేసులు 66, సివిల్‌ కేసులు 27, ఎంసీ 2, డీవీసీ 2, ఎన్‌ఐయాక్ట్‌ 16, ఎకై ్సజ్‌ 101, ఎంవీఓపీ 39, అడ్మిషన్‌ కేసులు 74, ఈపీ 15 కేసులు చొప్పున మొత్తం 1,021 కేసులు పరిష్కారం కావడంతో పాటు పలు కేసుల్లో కక్షిదారులకు రూ.3.76 కోట్ల పరిహారం అందించామన్నారు. చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా లోక్‌ అదాలత్‌కు వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రాజీ కాగల కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. కుటుంబ కలహాల వలన భార్యాభర్తలు కోర్టును ఆశ్రయిస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ జగన్‌మోహన్‌ రెడ్డి, వివేకానందరెడ్డి, పీపీ శ్రీనివాసులు, రావినూతల దుర్గాప్రసాద్‌, విజయశేఖర్‌రెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, ఓబుల్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ తదితర సీనియర్‌, జూనియర్‌ లోక్‌అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

పది వేల కేసుల పరిష్కారం

కర్నూలు (టౌన్‌): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో పది వేలకు పైగా కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 చోట్ల జాతీయ లోక్‌ అదాలత్‌ బెంచీలు ఏర్పాటు చేసి కక్షిదారుల కేసులు పరిష్కారం చేసినట్లు చెప్పారు. కర్నూలులో 5 బెంచీలు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు జి.భూపాల్‌ రెడ్డి, లక్ష్మిరాజ్యం, జ్యోత్స్నాదేవి, ఎం.సరోజనమ్మ, విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మినరసింహారెడ్డి 4,500 కేసులు పరిష్కారం చేశారన్నారు. నంద్యాలలో 1,021, ఆదోనిలో 432, ఆళ్లగడ్డలో 554, ఆలూరులో 291, ఆత్మకూరులో 319, బనగానపల్లెలో 714, డోన్‌లో 630, కోవెలకుంట్లలో 402, నందికొట్కూరులో 266, పత్తికొండలో 427, ఎమ్మిగనూరులో458 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement