మోసపోయామని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది | - | Sakshi
Sakshi News home page

మోసపోయామని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది

Mar 8 2025 1:49 AM | Updated on Mar 8 2025 1:45 AM

● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కల్లూరు: చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసపోయామని ప్రజలకు అర్థమైందని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో బడ్జెట్‌ కేటాయింపులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బండారాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాలతో సహా బయటపెట్టారన్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో సూపర్‌ సిక్స్‌ పథకాలైన తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ మొదలగు పథకాల అమలు ఊసే లేదన్నారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఏమీ ఇవ్వొద్దని బహిరంగగానే చెప్పడం వివక్ష పాలనకు నిదర్శనమన్నారు.

ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి

వైఎస్‌ జగన్‌..

ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కాటసాని అన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిక్షంగా గుర్తించాలని జగన్‌ డిమాండ్‌ చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హత కల్గిన రైతులందరికి పార్టీలు, కులాలు, మతాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించామన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ. 20వేలు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ఇంత వరకు ఒక్క రైతుకు సహాయం అందలేదన్నారు.

12న ఫీజు పోరును విజయవంతం చేద్దాం..

ఈనెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కాటసాని పిలుపు నిచ్చారు. నంద్యాల జిల్లా ఉదయానంద హోటల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు విద్యార్థులతో కలసి ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తామన్నారు. ర్యాలీకి జిల్లాలోని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. అలాగే 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం కల్లూరు అర్బన్‌ శరీన్‌నగర్‌లోని దివంగత నేత వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గర పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement