నీటి ఎద్దడి నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Mar 8 2025 1:49 AM | Updated on Mar 8 2025 1:45 AM

మిడుతూరు: గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి సూచించారు. శుక్రవారం మిడుతూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును ఆయన పరిశీలించి, ట్యాంక్‌ సామర్థ్యం, నీటి సరఫరా తదితర వివరాలు తెలుసుకున్నారు. నీటిని క్లోరినేషన్‌ చేయడంతోపాటు అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. 15వ ఆర్థిక సంఘం, మండల పరిషత్‌ నిధులతో చేపట్టిన పనులను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ ఇంజినీర్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ దశరథరామ య్య, ఏఈ విశ్వనాథం, ఈఓఆర్డీ సంజన్న, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

చెత్త నుంచి సంపద సృష్టిద్దాం

నంద్యాల(అర్బన్‌): స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టిద్దామని డీపీఓ షేక్‌ జమీవుల్లా తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీపై నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో శుక్రవారం మండల గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన డీపీఓ మాట్లాడుతూ ప్రతి రోజూ ఇంటి నుంచి వచ్చే తడి, పొడి చెత్తల ద్వారా ఎరువు, వర్మీకంపోస్టును తయారు చేసి స్థానిక రైతులకు అందే విధంగా చూడాలన్నారు. కేజీ రూ.10 చొప్పున గ్రామంలోని రైతులకు అందజేసి పంట దిగుబడులకు సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణశ్రీ, ఈఓఆర్‌డీ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

పురుగు మందులు, ఎరువులదుకాణాల్లో తనిఖీలు

నంద్యాల(అర్బన్‌): జిల్లా కేంద్రంలోని నంద్యాల పట్టణంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో శుక్రవారం వ్యవసాయాధికారులు తనిఖీ చేశారు. ఆత్మకూరు, నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయులు, రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో విశ్వనాథ ఆగ్రో ఏజెన్సీస్‌, వైఎన్‌ రెడ్డి ఏజెన్సీస్‌, వెంకట సునిల్‌ ట్రేడర్స్‌ దుకాణాల్లో బయో ఉత్పత్తులను పరిశీలించారు. అనుమతి పత్రాలు, స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌ బుక్స్‌, రసీదులు సరిగా లేకపోవడంతో రూ.21.76 లక్షల విలువైన బయో ఉత్పత్తుల అమ్మకాలను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతి పొందిన బయో ఉత్పత్తులనే దుకాణదారులు విక్రయించాలన్నారు. వీరి వెంట ఏఓ ప్రసాదరావు ఉన్నారు.

నీటి ఎద్దడి నివారణకు చర్యలు 1
1/2

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు చర్యలు 2
2/2

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement