‘తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలను తెలియజేయాలి. వారి ఉన్నత స్థితికి తోడ్పాటు పడాలి’ అని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి బెజవాడ రాధారాణి అన్నారు. తన
తండ్రి ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. వివరాలు జడ్జి మాటల్లోనే..‘‘ మా ఇంట్లో నాన్నగారు నన్ను లాయర్‌గా చదువుకోవాలని ప్రోత్సహించారు. ఆయన కోరిక ప్రకారం లా చదివి పాసయ్యాను. పెళ్లి చేసుకున్న తరువాత భర్త సహకారంతో ఐదు సంవత్సరాల్లో జడ్జి అయ్యాను. ప్రతి ఒక్కరూ సమాజానికి మంచి చేసే విధంగా ఎదగాలి.. సమయాన్ని వృథా చేసుకోకుండా దేశానికి ఉపయోగపడే విధంగా పాటుపడాలి. న్యాయవ్యవస్థలో ఎక్కువగా మహిళలు జడ్జిలుగా రాణిస్తున్నారు.’’
– నంద్యాల(వ్యవసాయం)