ప్రకృతి వ్యవసాయంలో గూడూరుకు చెందిన మహిళ రైతు జి. లక్ష్మీదేవి అద్భుతంగా రాణిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాకు 10 ఎకరాల భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఏటీఎం నమూనాలో ఒక ఎకరాలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. పెట్టుబడి కోసం రూ.15 వేలు ఖర్చు చేయగా.. రూ.లక్షకుపైగా ఆదాయం వచ్చింది. మిగిలిన మూడు ఎకరాల్లో వివిధ పంటలు వేస్తున్నాం. మా పంటల సాగును ప్రత్యేక బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. పంటలను పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి కూడా అభినందించారు.’’
– కర్నూలు(అగ్రికల్చర్)