ఆలయంలోకి చెప్పులతో టీటీడీ బోర్డు మెంబర్!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఓర్వకల్లు మండలం శ్రీ బుగ్గరామేశ్వరస్వామి దేవస్థానంలో సాక్షాత్తూ టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ ఆలయంలో చెప్పులు వేసుకొని అధికారులతో కలిసి మహాశివరాత్రి వేడుకలను పర్యవేక్షించారు. అధికారులందరూ ఆలయంలోకి వెళ్లకముందే చెప్పులను వదిలి లోనికి వెళ్లారు. కానీ టీటీడీ బోర్డు సభ్యుడు మాత్రం చెప్పులు వేసుకొని మరీ ఆలయంలో కలియతిరిగారు. ఆయన వెంట కర్నూలు టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబునాయుడు, ఈఓ మద్దిలేటి ఉన్నారు. ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.