
ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ప్రారంభం
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఆదివారం రాత్రి కౌతాళంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రత్యేక ఫాతేహాల అనంతరం స్వామి సమాధిని సుగంధ ద్రవ్యాలు, పానీయాలతో శుభ్రం చేశారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, పీఠాధిపతి సయ్యద్ ఖాదర్‌బాషా చిషీ, వారి శిష్య బృందంతో ప్రత్యేకంగా తెచ్చిన చద్దర్‌ను స్వామి సమాధిపై ఉంచి పూలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఫాతేహాలు నిర్వహించి నగరావాయించారు. దీంతో ఉరుసు ప్రారంభమైంది. ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయని ధర్మకర్త తెలిపారు. వర్షం వచ్చినా భక్తులు ఇబ్బందులు కలుగకుండా దర్గాలో ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. గుల్షన్ కమి టీ అధ్యక్షుడు మున్నపాషా, కర్ణాటకలోని సర్మస్‌వలి దర్గా నిర్వాహకుడు దూద్‌బాషా పాల్గొన్నారు.
విద్యుత్
అలంకరణలో దర్గా
ఉరుసును పురస్కరించుకుని దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముఖ ద్వారంతో పాటు 60 అడుగుల మహా గోపురం మజీద్‌కు వెళ్లడానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారం వరకు విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. సోమవారం గంధం, మంగళవారం ఉరుసు ఉంటుందని ధర్మకర్త తెలిపారు.

ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ప్రారంభం