
బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తున్న డీఆర్వో పుల్లయ్య, తహసీల్దార్ సిరాజుద్దీన్
మిడుతూరు: అలగనూరు గ్రామానికి చెందిన సుగదాసి రాజు కుమార్తె రాధకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. వ్యాధితో బాధపడుతున్న కూతురును తీసుకొని గురువారం పత్తికొండతో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించుకున్నారు. సమస్య తీవ్రతను తెలుసుకున్న సీఎం మానవతా దృక్పథంతో రాధ కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ ఆదేశించారు. ఈ మేరకు కర్నూలులో ఉన్న బాధిత కుటుంబాన్ని డీఆర్వో పుల్లయ్య, మిడుతూరు తహసీల్దార్ సిరాజుద్దీన్ గురువారం రాత్రి కలిసి రూ. లక్ష చెక్‌ను అందజేశారు.