
నంద్యాల(సిటీ): పట్టణంలోని పలు హోటళ్లపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఎన్.పూజిత, అడిషనల్ ఎస్పీ కర్నూలు వారి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఈ మేరకు నాసిరకమైన ఆహార పదార్థాలతో పాటు మాంసం నిల్వ చేయడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని నిల్వ ఉంచడంతో ఆరు హోటళ్లకు రూ.2.75 లక్షలు జరిమానా విధించామన్నారు. స్థానిక పద్మావతినగర్‌లోని కిచెన్ గార్డెన్ హోటల్‌కు రూ.30వేలు, మహారాజ హోటల్‌కు రూ.60వేలు, హైదరాబాద్ చెఫ్ హోటల్‌కు రూ.30వేలు, క్లాసిక్ జైల్ రెస్టారెంట్‌కు రూ.25 వేలు, 9 ఆర్‌క్లౌడ్స్ రెస్టారెంట్‌కు రూ.60 వేలు, ఆర్‌ఆర్ ప్యారడైజ్‌కు రూ.50 వేలు జరిమానా విధించామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హోటళ్లు, ఇతర ఆహార పదార్థాలను విక్రయించే వారు నాణ్యమైన ఆహారాన్ని అహ్లాదకరమైన వాతావరణంలో అందించాలన్నారు. దాడుల్లో జప్తు చేసుకున్న ఆహార పదార్థాలను మున్సిపల్ అధికారులు డంప్‌యార్డుకు తరలించామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు నాయక్, మున్సిపల్ శానిటరీ సూపర్‌వైజర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆరు హోటళ్లకు
రూ.2.75 లక్షల జరిమానా