1,200 విద్యుత్‌ స్తంభాలు మంజూరు | - | Sakshi
Sakshi News home page

1,200 విద్యుత్‌ స్తంభాలు మంజూరు

Jun 3 2023 1:50 AM | Updated on Jun 3 2023 1:50 AM

కర్నూలు(రాజ్‌విహార్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా అవసరాల కోసం 1,200 విద్యుత్‌ స్తంభాలు మంజూరయ్యాయి. వర్షాలు, ఈదురు గాలులు, చెట్ల కొమ్మలు విరిగి పడడం వంటి కారణాలతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయే అవకాశాలున్నందున ఇక్కడి అధికారులు ఉన్నతాధికారుల నివేదికలు పంపారు. దీనిపై దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె. సంతోషరావు స్పందించి కావాల్సిన మేరకు స్తంభాలు మంజూరు చేశారు. అనంతపురం, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి స్తంభాలు పంపించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో వాటిని తెప్పించినట్లు కర్నూలు, నంద్యాల జిల్లాల ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ఎం. ఉమాపతి పేర్కొన్నారు.

ఉద్యాన శాఖలో బదిలీలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉద్యాన శాఖలో పలువురు హార్టికల్చర్‌ అధికారులు బదిలీ అయ్యారు. కర్నూలు ఉద్యాన శాఖ జిల్లా అధికారి కార్యాలయంలో సాంకేతిక హార్టికల్చర్‌ అధికారిగా విధు లు నిర్వహిస్తున్న మహబూబ్‌బాషా గుంటూరులోని కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. పత్తికొండ హార్టికల్చర్‌ అధికారి వై.అనూష జిల్లా అధి కారి కార్యాలయంలో సాంకేతిక హెచ్‌వోగా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా రాయ దుర్గం హెచ్‌వో దస్తగిరి పత్తికొండ హెచ్‌వోగా బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లాలో చందన ఆత్మకూరు హెచ్‌వోగా నియమితులయ్యారు.

6 లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 6వ తేదీలోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని ఐటీఐ కాలేజీల కన్వీనర్‌ పి.వి ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెరికేషన్‌ కోసం టెన్త్‌ మార్కులు జాబితా, టీసీ, ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు.

కేజీబీవీల్లో బదిలీలకు

దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు(సిటీ): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ఈనెల 7 లోపు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.వేణుగోపాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి బదిలీ ప్రక్రియ మొద లవుతుందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేజీబీలకు పంపించామన్నారు. దరఖాస్తులు ఈనెల 7 లోపు కర్నూలు సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.

మిగిలిన సీట్లకు

దరఖాస్తు చేసుకోండి

పాణ్యం: నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ రెసిడెన్షియల్‌ బాల, బాలుర పాఠశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌ జయమ్మ శుక్రవారం తెలిపారు. పాణ్యం మండలం నెరవాడ మెట్ట బీసీ బాలికల పాఠశాలలో 6వ తరగతిలో బీసీ–1, ఎస్సీ–1, 7వ తరగతిలో బీసీ ఈ–1 ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆళ్లగడ్డ బాలికల పాఠశాలలో 6వ తరగతిలో బీసీ డీ –02, ఎస్సీ– 03, 7వ తరగతిలో బీసీ బీ–1, ఎనిమిదవ తరగతిలో బీసీ ఏ –02, బీసీ బీ– 01, బీసీ డీ–01, బీసీ ఈ – 02, అర్బన్‌–01, అలాగే తొమ్మిదవ తరగతిలో ఓసీ–01, ఎస్సీ–01, అర్బన్‌–01 చొప్పున సీట్లు ఖాళీ ఉన్నట్లు చెప్పారు. అలాగే బనగానపల్లె బాలుర పాఠశాలలో తొమ్మిదవ తరగతితో బీసీ–02 , బేతంచెర్లలో తొమ్మిదవ తరగతిలో బీసీ ఏ – 2 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 10న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు 7780712810ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement