ఫిట్‌నెస్‌ లేకుంటే సీజ్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ లేకుంటే సీజ్‌ !

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాలి

నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ (ఆర్‌టీఏ) అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కనీస ఫిట్‌నెస్‌ లేని ప్రైవేటు స్కూల్‌ బస్సులను రోడ్లపైకి వదిలితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 745 స్కూల్‌ బస్‌లు ఉండగా.. ఇప్పటి వరకు 254 బస్‌లు ఫిట్‌నెస్‌ పొందాయి. ఇంకా 491 బస్‌లు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. జూన్‌ 12 నాటికి అన్ని వాహనాలకు భద్రతా ప్రమాణాలు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు

ఫిట్‌నెస్‌ తనిఖీలు ఇలా..

ఫిట్‌నెస్‌ తనిఖీల్లో భాగంగా బస్‌లకు బ్రేకులు, టైర్లు, లైట్లు, ఎమర్జెన్సి డోర్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు, భద్రతా పరికరాలను పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలకు ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. లోపాలున్న వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు రాజీపడకుండా ప్రతి బస్‌కు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.

డ్రైవర్లకు శిక్షణ సర్టిఫికెట్‌ ఉంటేనే..

సిరిసిల్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్కూల్‌ బస్‌లు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నారు. డ్రైవర్లు, రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతోపాటు విద్యార్థుల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేలా శిక్షణ ఇస్తున్నారు. అనుకోని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి.. ప్రమాదాల నుంచి విద్యార్థులను సురక్షితంగా ఎలా కాపాడాలని అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. సిరిసిల్లలో శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆ సర్టిఫికెట్‌ పొందిన వారు మాత్రమే స్కూల్‌ బస్‌లను నడిపేందుకు అర్హత పొందుతారు.

ఫిట్‌నెస్‌ లేకుండా స్కూల్‌ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. జరిమానా విధించడంతోపాటు బస్‌లు సీజ్‌ చేస్తాం. పిల్లల భద్రత విషయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. యాజమాన్యాలు తప్పనిసరిగా బస్‌లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాలి.

–వాణి, జిల్లా రవాణాశాఖ అధికారి

ఫ జిల్లాలో 745 స్కూల్‌ బస్‌లు

ఫ తనిఖీలు చేయించింది 254 మాత్రమే

ఫ స్కూల్‌ బస్‌ డ్రైవర్లకు సిరిసిల్లలో శిక్షణ

ఫ సర్టిఫికెట్‌ పొందిన వారికి మాత్రమే అనుమతి

Advertisement
 
Advertisement
Advertisement