స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

నల్లగొండ టూటౌన్‌ : యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. సీఎం కప్‌ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్‌లో బహుమతులు ప్రదానం చేశారు. జాబ్‌మేళాలో ఎంపికై న యువతకు నియమక పత్రాలు అందజేసి మాట్లాడారు. దేశంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, యువతే దేశానికి గొప్ప వరమన్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెంచే ఉద్దేశంతో ‘ఫిట్‌ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నల్లగొండలోని న్యాక్‌, సెట్విన్‌ సెంటర్‌, ఇందిరా మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు కెరీర్‌, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఎంఎస్‌ఎంఈ ద్వారా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. యువత డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఎం కప్‌ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన హాకీ జట్టును అభినందించారు. అనంతరం క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, అదనపు ఎస్పీ రమేష్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్‌ అలీ, కోచ్‌ శంభులింగం తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement