బుధవారం ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకున్నా. గురువారం ఉద యం వచ్చా, సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. గంటల తరబడి సమయం పడుతోంది. సిబ్బంది సరిపోవడం లేదని చెబుతున్నారు. ఆలస్యమైనా చేస్తామంటున్నారు. ఎండకు కార్యాలయంలో తట్టుకోలేకపోతున్నాం. కనీసం మంచినీరు లేవు.
– లింగయ్య, పారేపల్లిగూడెం
భూముల ధరలు పెరుగుతుండటంతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చాం. గంటలకొద్దీ నిలబడాల్సి వచ్చింది. కూర్చోవడానికి కుర్చీలు లేవు. అందరు నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు ఎన్ని గంటలు నిలబడాలి. కనీసం మంచినీరు కూడా లేదు. గ్రామాల నుంచి వచ్చి ఎండకు ఇబ్బందులు పడుతున్నాం.
– విష్ణువర్ధన్, నల్లగొండ


