భూమిపై జీవరాశులు, వాటి జన్యువులు, జీవావరణ వ్యవస్థల సమాహారమే జీవ వైవిధ్యం.
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026
- 8లో
భానుడి ఉగ్రరూపం
ఫ 44 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు
ఫ బెంబేలెత్తుతున్న జనం
నల్లగొండ : భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దీంతో నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వాతావరణం వేడెక్కి ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి అయితేనే బయటికి వస్తున్నారు. చాలాచోట్ల ఉదయం 11 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రి 7 గంటలైనా వేడి తగ్గడం లేదు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానియాలు తాగుతున్నారు. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండంతో జనాలు బెంబేలెత్తుతున్నారు.


