ఉదయసముద్రంలో మాక్‌ డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఉదయసముద్రంలో మాక్‌ డ్రిల్‌

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

నల్లగొండ టూటౌన్‌ : ఆకస్మత్తుగా వచ్చే విపత్తును ఎలా ఎదుర్కొని బయట పడాలనే అంశంపై ఎంజీ యూనివర్సిటీకి చెందిన యువ ఆపద మిత్ర – ఎన్‌సీసీ క్యాడెట్లకు గురువారం పానగల్‌ ఉదయ సముద్రంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా యువతను సమాజస్థాయి విపత్తు ప్రతిస్పందన బృందాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 31వ బెటాలియన్‌, ఎన్‌సీసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో పానగల్‌ ఉదయ సముద్రంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించి గర్భిణులు, వృద్ధులు, పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న వారు అత్యంత సున్నిత మార్గాల ద్వారా ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఎలా ఇవ్వాలి, ఎలా రక్షించాలి, ఎలా సురక్షిత ప్రాంతానికి చేర్చాలి అనే అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 31వ బెటాలియన్‌ ఎన్‌సీసీ అధికారులు, లెఫ్టినెంట్‌ కల్నల్‌ శశిధర్‌రావు, సుబేదార్‌ మేజర్‌ మాధవరావు, సుబేధార్‌ కొమ్ము మల్లయ్య, ఏపీడీ హరీష్‌కుమార్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు సాయిదీపక్‌, ఏఎన్‌ఓ మశ్చేందర్‌, రామునాయక్‌, నాగు, భాగ్యలక్ష్మి, శిక్షకులు శివకుమార్‌, తేజస్విని, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement