మిర్యాలగూడ టౌన్ : జిల్లాలో అక్రమ ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం మిర్యాలగూడ రూరల్‌పోలీస్ స్టేషన్‌లో ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు నిర్వహించిన కౌన్సిలింగ్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక ద్వారా 2024లో రూ.35 కోట్లు, 2025లో రూ.43 కోట్లు, 2026లో ఇప్పటి వరకు రూ.83 కోట్లు వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 196 వరకు అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేకంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సహాజ వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు పీఎన్‌డీ ప్రసాద్, సోమనర్సయ్య, ఎస్‌ఐలు మల్లికంటి లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, నరేష్ తదితరులు ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్


